అమెరికా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ వాల్ మార్ట్ ఉద్యోగాల కోతపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. భారీగా కార్మికులను తీసేయనున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ ఆర్టికల్ రాసింది. వాల్ మార్ట్ అనే రిటైలర్ సంస్థ అమెరికాలోనే అతి పెద్ద బిజినెస్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీ అయిన వాల్ మార్ట్ యూస్ లో 4600 స్టోర్లు నడుపుతుంది. వందలాది మంది కార్మికులు ఆ కంపెనీలు పనిచేస్తున్నారు.
ఈ కంపెనీ చాలామంది కార్పొరేట్ ఎంప్లాయిస్ ను తగ్గించి, వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్న రిమోట్ వర్కింగ్ ఎంప్లాయిస్ ను ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని ఆర్డర్స్ పంపుతుంది. డల్లాస్, అట్లాంటా, టోరంటో వంచి చిన్ని స్టోర్స్ లో పని చేసే ఎంప్లాయిస్ పెద్ద స్టోర్స్ లోకి మారాలని ఆలోచిస్తున్నారు.ఈ క్రమంలో ఉద్యోగులు కంపెనీకి భారంగా మారనున్నారు. అందుకే వాల్ మార్ట్ ఎంప్లాయిస్ ను తీసేయాలని ఆలోచిస్తోంది.