సెన్సార్ పూర్తి చేసుకున్న 'వాల్తేరు వీరయ్య'

సెన్సార్ పూర్తి చేసుకున్న 'వాల్తేరు వీరయ్య'

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి తాజా అప్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. తాజా అప్‌డేట్ ప్రకారం సీబీఎఫ్‌సీ ఈ చిత్రానికి క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. 

ఇందులో చిరంజీవి సరసన శ్రుతిహాసన్ హీరోయిన్‌‌గా నటించింది. ఈ చిత్రంలో రవితేజ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఇక వైజాగ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కోసం ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా బాస్‌ పార్టీ స్పెషల్ సాంగ్‌లో మెరువబోతుంది. ఈ చిత్రానికి రాక్‌ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.