ఇవాళ వరంగల్ జిల్లాలో వాల్తేరు వీరయ్య మూవీ టీమ్ సందడి చేయనుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం బాక్సాఫీస్ దగ్గర రికార్డ్‌లు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే చిత్ర యూనిట్ అంతా కలిసి సక్సెస్ పార్టీ కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో చిత్రం బృందం ఇవాళ వరంగల్ లో పర్యటించనుంది. ఇందులో భాగంగా సాయంత్రం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో విజయోత్సవ సభ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, శృతిహాసన్, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొననున్నారు.
సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఇప్పటికే100 కోట్ల క్లబ్‌లో చేరింది. మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 108 కోట్ల గ్రాస్ చేరుకుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్ చూసి ఫ్యాన్స్ సంబరపడిపోయారు. చిరు డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్‌కు తోడు.. కామోడీ జత కావడంతో వాల్తేరు వీరయ్య సూపర్ హిట్‌గా దూసుకెళ్తోంది. ఇందులో మెగాస్టార్ కు జోడీగా శృతి హాసన్ నటించింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు.