ఫ్లాప్ సినిమాతో హీరోయిన్ దశ తిరిగింది.. 6 ఆఫర్లతో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ బ్యూటీ..

ఫ్లాప్ సినిమాతో హీరోయిన్ దశ తిరిగింది.. 6 ఆఫర్లతో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ బ్యూటీ..

హిందీలో ఇటీవలే రిలీజ్ అయిన బేబీ జాన్ సినిమా ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన వామికా గబ్బి నటనకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో సినీ విమర్శకుల నుంచి ప్రశంసలతోపాటూ సినీ ఆఫర్లు కూడా క్యూ కడుతున్నాయి. 

సినీ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం  వామికా గబ్బి చేతిలో దాదాపుగా 6 సినిమా ఆఫర్లు ఉన్నాయి. ఇందులో తెలుగులో ప్రముఖ హీరో అడవి శేష్ హీరోగా నటిస్తున్న గూఢచారి 2 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి తెలుగు ప్రముఖ డైరెక్టర్ వినయ్ కుమార్ సింగిరెడ్డి దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాతలు T. G. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల మరియు అభిషేక్ అగర్వాల్ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే గతంలో వచ్చిన గూఢచారి సినిమా సూపర్ హిట్ అయ్యింది. 

అయితే నటి వామికా గబ్బి తెలుగులో 2015లో ప్రముఖ హీరో సుధీర్ బాబు హీరోగా నటించిన "భలే మంచి రోజు" అనే సినిమాలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు. దీంతో వామికా కి టాలీవుడ్ లో ఆఫర్లు రాలేదు. ఇక చేసేదేమీ లేక మళ్ళీ బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. కానీ అక్కడ కూడా ఆఫర్ల విషయంలో ఇబ్బందులు పడింది. కానీ బేబీ జాన్ సినిమాతో మంచి గుర్తింపు లభించడంతో ప్రజెంట్ తెలుగుతోపాటూ హిందీ, తమిళ్, మళయాలం తదితర భాషల్లో నటిస్తోంది. ఇందులో 3 ఇన్మలు దాదాపుగా సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి.