అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘జీ2’. గూఢచారికి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఫ్రాంచైజీలో ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా అడివి శేష్ సరసన వామికా గబ్బి నటిస్తోందని రివీల్ చేశారు.
ఆమె పాత్ర స్పై ప్రపంచానికి కొత్తదనం ఇస్తుందని మేకర్స్ చెప్పారు. ఇటీవల అడివి శేష్‌తో యూరోపియన్ షూటింగ్ షెడ్యూల్‌ను ముగించిన వామికా ఈ మూవీ కోసం ఎక్సయింట్‌గా ఉన్నానంది. ఈ ప్రయాణంలో భాగమవడం ఆనందంగా ఉందని, టాలెంటెడ్ టీమ్‌తో వర్క్ చేయడం ఇన్‌స్పైర్ చేసిందని చెప్పింది. ఇందులో మురళీ శర్మ, సుప్రియ యార్లగడ్డ, మధు షాలిని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ డ్రామాతో సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుందని మేకర్స్ చెప్పారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల
కానుంది.