- వనపర్తి కలెక్టర్ హెచ్చరిక
పెబ్బేరు/ శ్రీరంగాపూర్, వెలుగు: ఏఈవోలు ఆఫీసులో లేదా ఏదో ఒక చోట కూర్చొని క్రాప్ బుకింగ్చేస్తే చర్యలు తప్పవని వనపర్తి జిల్లా కలెక్టర్ఆదర్శ్సురభి హెచ్చరించారు. అడిషనల్కలెక్టర్సంచిత్గంగ్వార్ తో కలిసి పెబ్బేరు మండలంలో గురువారం ఆయన పర్యటించారు. కంచిరావుపల్లి గ్రామ శివారులో క్రాప్ బుకింగ్ ప్రక్రియను పరిశీలించారు. అధికారులు ఒకచోట కూర్చొని అంచనాలతో క్రాప్ బుకింగ్ చేయవద్దని, ప్రతీ పొలం వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడి నమోదు చేయాలన్నారు. ఏ ఒక్క రైతు కూడా తమ ఏఈవో ఎవరో తెలియదని, క్రాప్ బుకింగ్ కోసం సంప్రదించలేదని తెలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనంతరం గ్రామంలోని జడ్పీహెచ్ఎస్, ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్.. తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో నాణ్యత లేదని అసహనం వ్యక్తం చేశారు. పనులు పూర్తి కాకుండానే పూర్తి అయినట్లు తప్పుడు నివేదిక ఇచ్చిన ఇంజినీరింగ్ అధికారులపై ఫైరయ్యారు. త్వరగా పనులు పూర్తి చేయాలని, నాణ్యత లోపం ఉంటే చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.
రంగనాయక స్వామికి పూజలు
శ్రీరంగాపూర్ పర్యటన సందర్భంగా ఆలయాన్ని కలెక్టర్ సందర్శించారు. శ్రీదేవి భూదేవి సమేత రంగనాయక స్వామినికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు పూర్ణకుంభం, మేళతాళాలతో స్వాగతం పలికారు. మాజీ జడ్పీటీసీ రాజేంద్ర ప్రసాద్ ఆలయం విశేషాలను కలెక్టర్ వివరించడంతో పాటు శ్రీరంగాపూర్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచాలని కోరారు.
అనంతరం శ్రీరంగాపూర్ అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించి, ప్రహరీ గోడ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలన్నారు. పీహెచ్సీని సందర్శించి, అక్కడే ఉన్న గర్భిణీలకు తల్లి పాల ప్రాముఖ్యతనువివరించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏడీఏ శ్రీనివాస్, డీఎంహెచ్వో జయచంద్ర మోహన్, డా.సాయినాథ్, ప్రోగ్రాం ఆఫీసర్ డా.పరిమళ, పెబ్బేరు తహసీల్దార్ లక్ష్మి, ఎంపీడీవో రవీందర్, డీఈ శ్రీనివాస్ , ఏఈవో లు పాల్గొన్నారు.