
వనపర్తి, వెలుగు: జర్నలిస్టులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం టీయూడబ్ల్యూజే ( ఐజేయూ) ఆధ్వర్యంలో చిట్యాల గ్రామ శివారులోని దేశినేని శ్యామలమ్మ ఫంక్షన్ హాల్లో మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ సహకారంతో జిల్లాలోని జర్నలిస్టులకు ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
సంఘం రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నిత్యం వ్యాయామం చేయడంతో పాటు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. జర్నలిస్టులు ఈ మెడికల్ క్యాంపు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్వో శ్రీనివాసులు, ప్రోగ్రాంఆఫీసర్సాయినాథ్రెడ్డి, డాక్టర్లు రామచంద్రారావు, దయావాస్వాని, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.