- వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
గోపాల్ పేట వెలుగు : ప్రతి గర్భిణిని గుర్తించి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం జరిపించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం గోపాల పేట మండలంలో పర్యటించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. మండల పరిధిలో డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జ్వరం లక్షణాలతో వచ్చే రోగులకు రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించాలని ఆదేశించారు.
గోపాల్ పేట పాత తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. కొంత మరమ్మతులు చేయించి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థకు ఇస్తే ఎలా ఉంటుందని అంచనా వేశారు. గోపాల్ పేట మండలం ఏదుట్ల గ్రామ రైతు వేదికలో వ్యవసాయ శాఖ అధికారులు పంట రుణమాఫీ కానీ రైతుల కుటుంబ మ్యాపింగ్ చేస్తుండగా కలెక్టర్ పరిశీలించారు. చిన్న చిన్న పొరపాట్లు జరిగి రుణమాఫీ జరగని రైతుల వివరాలు సరిచేశాక డబ్బులు జమ అవుతున్నాయని వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, గోపాల్ పేట తాసిల్దార్ తిలక్, మెడికల్ ఆఫీసర్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.