
- పలు ప్రైవేటు హాస్పిటల్స్ లో తనిఖీలు
పెబ్బేరు, వెలుగు: ప్రైవేటు హాస్పిటల్స్ నిర్వాహకులు, ఆర్ఎంపీలు, పాలీ క్లినిక్‌లు నడిపేవారు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని వనపర్తి డీఎంహెచ్‌వో శ్రీనివాసులు హెచ్చరించారు. పెబ్బేరు పట్టణంలోని ప్రైవేటు హాస్పిటల్స్, ఆర్ఎంపీ, పాలీక్లినిక్‌లు, ల్యాబ్‌లను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొందరు ఆర్ఎంపీల వద్ద కర్నూల్‌కు చెందిన హాస్సిటల్స్ రెఫరల్ లెటర్స్ ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఆయుర్వేద ఆర్ఎంపీ వివిధ రకాల మందులు, సిరప్ లు అక్కడే విక్రయిస్తుండటంతో హెచ్చరించారు.
.ప్రైవేటు క్లినిక్‌లు, హాస్సిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషంట్లతో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు. ఓ పైల్స్క్లినిక్లో ఆర్ఎంపీ ఓ పేషంట్ కు రెండు యాంటీ బయాటిక్స్ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసి, వారంలోపు అతని సర్టిఫికెట్లు సబ్మిట్చేయాలని ఆదేశించారు. లక్ష్మీమహాదేవ హాస్సిటల్లో స్కానింగ్మెషిన్కు పర్మిషన్ ఉన్నా.. సంబంధిత డాక్టర్ లేకపోవడంతో దాన్ని సీజ్‌చేశారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాసులు, మాస్‌మీడియా ఆఫీసర్రవి కుమార్ తదితరులున్నారు.