క్రీడలతో యువతకు గుర్తింపు :ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

క్రీడలతో యువతకు గుర్తింపు :ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పెబ్బేరు, వెలుగు: చిన్నప్పటి నుంచే ఆటలపై ఆసక్తి పెంచుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సూచించారు. ఆదివారం పెబ్బేరు మున్సిపాలిటీలో పరిధిలో పర్యటించారు. చెలిమిల్ల ప్రీమియర్  లీగ్  క్రికెట్  టోర్నీ విజేతలకు బహుమతులు అందజేశారు. ఎమ్మెల్యే క్రీడాకారులతో కలిసి క్రికెట్  ఆడి ఉత్సాహపరిచారు. అనంతరం పీజేపీ గ్రౌండ్​లో చౌడేశ్వరిమాత ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన పెబ్బేరు ప్రీమియర్  లీగ్  క్రికెట్  టోర్నీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమి చెందిన వారు మరింత కసిగా ఆడి ప్రతిభను చాటాలని సూచించారు. క్రీడలతో గుర్తింపు పొందవచ్చని, యువకులు ఉన్నత విద్య, ఉపాధితో పాటు క్రీడలపై దృష్టి సారించాలన్నారు. అనంతరం పెబ్బేరు మార్కెట్  యార్డ్  స్థలంలో కొత్తగా నిర్మించిన వాలీబాల్  గ్రౌండ్​ను ప్రారంభించారు. కౌన్సిలర్లు ఎల్ల స్వామి, అక్కమ్మ, ఏఎంసీ వైస్​ చైర్మన్​ విజయవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రంజిత్ కుమార్, దయాకర్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, సురేందర్ గౌడ్, రాంరెడ్డి, రాములు యాదవ్, టి. రాములు పాల్గొన్నారు.

కార్యకర్తలకు అండగా ఉంటా..

గోపాల్ పేట/రేవల్లి: పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి తెలిపారు. గోపాల్ పేటలోని ఓ ఫంక్షన్​ హాల్​లో ఉమ్మడి మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. గ్రామాల వారీగా కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిపబ్లిక్​ డే నుంచి అమలు చేస్తున్న నాలుగు పథకాలను నిరుపేదలకు అందిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు.

జిల్లాలోని అన్ని గ్రామాలు, తండాలను అభివృద్ధి చేసేందుకు రూ.800 కోట్లతో పనులు ప్రారంభించామని, గోపాల్ పేట, రేవల్లి మండలాలను పూర్తి స్థాయిలో డెవలప్​ చేయడమే లక్ష్యమన్నారు. పార్టీ కార్యకర్తలు గడపగడపకు కాంగ్రెస్  ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను తీసుకెళ్లాలని సూచించారు. కొంకి వెంకటేశ్, మందా సత్యశీలారెడ్డి, వాడల పర్వతాలు, శివన్న, మంగ దొడ్డి నాగశేషు యాదవ్, కేతపల్లి వెంకటయ్య, చంద్రశేఖర్, బాలపీరు, ప్రవీణ్ కుమార్, కోడిగంటి రాంచందర్  పాల్గొన్నారు.