ఘనంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బర్త్ ​డే వేడుకలు

ఘనంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బర్త్ ​డే వేడుకలు

వనపర్తి, వెలుగు: వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బర్త్​ డేను బుధవారం పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి, శారద దంపతులు ఖిల్లాగణపురం మండలం గట్టుకాడిపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడే కేక్​ కట్​ చేశారు. మార్కెట్​ యార్డులో, వనపర్తి శివారులోని అనాథాశ్రమంలో చిన్నారుల మధ్య, ఎస్టీ గర్ల్స్​​గురుకులంలో బర్త్​డే జరుపుకున్నారు. ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో యూత్​ కాంగ్రెస్​ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

రేవల్లి: ఎమ్మెల్యే మేఘారెడ్డి బర్త్​ డే  సందర్భంగా రేవల్లి కేజీబీవీలో కాంగ్రెస్  మండల అధ్యక్షుడు వాడల పర్వతాలు ఆధ్వర్యంలో కేక్  కట్  చేశారు. టెన్త్​ స్టూడెంట్లకు నోట్​బుక్స్  పంపిణీ చేశారు. ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో పరుశురాముడు, కాశీం, జమ్మి మల్లేశ్, సుభాన్, మిద్దె స్వామి, మడ్ల చరణ్, ధనుంజేయుడు, సురేందర్, సాగర్, కల్మూరి బాలకృష్ణ, దామోదర్, నరసింహ, రాముడు, మడ్ల రామాంజనేయులు రక్తదానం చేశారు.