
వనపర్తి, వెలుగు: జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణపై దృష్టి పెట్టాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ల్యాబ్ ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ మత్తులో దాడులు, నేరాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
పోలీసు శాఖ డ్రగ్స్ నిర్మూలన కోసం పోలీస్ శాఖ కృషి చేస్తుందని, యువత, విద్యార్థులు తమవంతు బాధ్యతగా డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని కోరారు. డ్రగ్స్ కు అలవాటు పడిన వారి సమాచారం ఇస్తే, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి మార్పు తెచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. డ్రగ్స్ లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఏఎస్పీ వీరారెడ్డి, ఎస్బీ సీఐ నరేశ్, సీసీఎస్ సీఐ రవిపాల్, ఏహెచ్ టీయూ ఎస్సై అంజద్ పాల్గొన్నారు.