వనపర్తిలో రూ. 7.50  కోట్లతో టర్ఫ్ మైదానం ఏర్పాటు

వనపర్తిలో రూ. 7.50  కోట్లతో టర్ఫ్ మైదానం ఏర్పాటు
  • స్పోర్ట్స్​ డెవలప్‌మెంట్‌తో వనపర్తికి జాతీయ గుర్తింపు

వనపర్తి, వెలుగు:  వనపర్తి జిల్లా కేంద్రాన్ని క్రీడా హబ్‌గా మార్చడానికి రూ.7.50  కోట్లతో టర్ఫ్ మైదానం నిర్మించనున్నట్లు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ  చైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రకటించారు.  ఆదివారం వనపర్తి డాక్టర్ బాలకిష్టయ్య స్పోర్ట్స్ గ్రౌండ్‌లో జరిగిన 68వ ఎస్‌జీటీ రాష్ట్రస్థాయి అండర్ 14 ఫుట్ బాల్  టోర్నీ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  వనపర్తిలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్ స్థాపిస్తామన్నారు.  

త్వరలో వనపర్తిలో ఫుట్ బాల్ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 50 గదులతో హాస్టల్ నిర్మిస్తామని చెప్పారు. అండర్ 14 విభాగంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో నిజామాబాద్ మొదటి, ఆదిలాబాద్ రెండో, రంగారెడ్డి మూడో స్థానంలో నిలిచాయి. బాలుర జట్లలో హైదరాబాద్ మొదటి, మహబూబ్‌నగర్ రెండో, రంగారెడ్డి మూడో స్థానం సాధించాయి.