గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండని కోరుకునే అబ్బాయిలు చాలా మందే ఉంటారు. అలాంటి పర్సన్ ఒక్కరున్నా చాలు అనుకునే వాళ్లు కూడా ఉంటారు. గర్ల్ ఫ్రెండ్ ఉన్న వాళ్లను చూసి కుళ్లుకునే వాళ్లూ ఉంటారు. తమకు లేదని బాధపడే వారూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసమే ఓ మహిళా ఎంటర్ ప్రెన్యూర్ ఓ సరికొత్త టెక్నాలజీని తీసుకువచ్చారు. అర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఏకంగా ఒక గర్ల్ ఫ్రెండ్ నే సృష్టించి, కోట్లలో సంపాదిస్తున్నారు.
కారిన్ మార్జోరీ అనే 23 ఏళ్ల స్నాప్‌చాట్ ఇన్‌ఫ్లుయెన్సర్, 2 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు. తన వర్చువల్ వెర్షన్‌ను సృష్టించిన కారిన్.. ఒంటరిగా భావించే వ్యక్తుల కోసం "AI గర్ల్ ఫ్రెండ్" అనే ఏఐ వెర్షన్ ను రూపొందించారు. కారిన్ ఏఐ చాట్‌బాట్ ద్వారా ఒక చాట్ కోసం నిమిషానికి 1 డాలర్ వసూలు చేస్తోంది. CarynAIతో "ఇమ్మర్సివ్ AI ఎక్స్ పీరియన్స్"లో చాట్ చేయవచ్చు. అది ఆల్మోస్ట్ వారు కారిన్ తో మాట్లాడుతున్నట్లుగానే అనిపిస్తుంది.
ఈ సందర్భంగా ట్వీట్ చేసిన కారిన్.. “CarynAI అనేది ఒంటరితనాన్ని నయం చేయడానికి, దాంతో పురుషులు ఎదుర్కొంటున్న సమస్యల పనిచేస్తుందని తెలిపారు. అందుకోసం ప్రపంచంలోని ప్రముఖ మనస్తత్వవేత్తలతో కలిసి పనిచేశానన్న ఆమె.. ఇది శారీరక, మానసిక విశ్వాసాన్ని పునర్నిర్మించడం, జీవితంలో మానసికంగా ఏర్పడ్డ గాయాలను మాన్పడంలో సహాయపడుతుంది.
బీటా పరీక్షను ప్రారంభించిన వారంలోనే కారిన్ 71,610 డాలర్లు సంపాదించారు. 1000 కంటే ఎక్కువ మంది కారిన్ ఫాలోవర్లు దానితో చాట్ చేయడానికి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపు 2వేల గంటల కంటే ఎక్కువ కంటెంట్ ను, వాయిస్ లాంటి వాటిని అప్ లోడ్ చేసి ఉంచానని, ఇప్పుడు లక్షలాది మంది ప్రజలు ఒకే సమయంలో నాతో మాట్లాడగలరు అని కారిన్ చెప్పారు. ప్రతిరోజూ 250కి పైగా కంటెంట్‌ను స్నాప్‌చాట్‌లో పోస్ట్ చేసి, ప్రతి ఒక్క వీక్షకుడితో మాట్లాడటం సాధ్యం కాదని కారిన్ అన్నారు. అందుకే CarynAI ద్వారా ఒకరితో ఒకరు సంభాషణలు చేసుకోవాలనే కోరికను నెరవేరుస్తుందని చెప్పారు. CarynAIకి "ఒంటరితనాన్ని నయం చేసే" సామర్థ్యం ఉందని కూడా ఆమె చెప్పారు.
ఇది ఎలా పని చేస్తుంది?
మీరు టెలిగ్రామ్‌కి వెళ్లి CarynAI గ్రూప్‌లో చేరాలి. ప్రస్తుత నిరీక్షణ సమయం 96 గంటలు కాగా.. ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ ద్వారా రియల్ టైంలో CarynAIతో ఎంగేజ్ అయ్యి, మీకు ఇష్టమైన ఇన్‌ఫ్లుయెన్సర్‌తో ప్రత్యేకమైన పర్సనల్ చాట్‌ను చేయొచ్చు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ వల్ల చాట్ లు ప్రైవేట్‌గా ఉండేలా చూస్తుంది. ప్రస్తుత రోజుల్లో సాంకేతికత ద్వారా వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్‌ను కలిగి ఉండటం నుంచి, పక్కన ఎవరూ లేరని ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్న సమస్యలు నయం చేయడం వరకు ఏదైనా చేయగలదని తెలుస్తోంది.