అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన చాతుర్యం చూపించారు. జర్నలిస్టులపై తనదైన స్టయిల్‌లో చురకలు వేశారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ సమీపంలో విమానం, హెలికాప్టర్ ఢీకొని ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. వైట్ హౌస్‌కు సమీపంలోని జరిగిన ఈ విమాన ప్రమాదంపై ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్ మాట్లాడుతూ.. అమెరికా చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదం.. వైట్ హౌస్ సమీపంలోనే జరిగింది.. మీరు స్పాట్‌కు వెళ్లి పరిశీలిస్తున్నారా అని ప్రశ్నించాడు.
Also Read :- అక్రమ వలసదారులను వెనక్కి పంపే ..చట్టంపై ట్రంప్ సంతకం
అంతే ఈ ప్రశ్న వినగానే ట్రంప్‌కు చిర్రెత్తుకొచ్చింది. దీనికి ఆయన ఆన్సర్ ఏంటో తెలుసా.. నేను వెళ్లి అక్కడ స్విమ్మింగ్ చేయాలా..? నేను స్మిమ్మింగ్ చేస్తే మీరు చూస్తారా..? అంటూ ఆన్సర్ ఇచ్చారు. అంతే ప్రశ్న అడిగిన జర్నలిస్ట్ షాక్ అయితే.. మిగతా జర్నలిస్టులు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.
Donald Trump is asked if he was going to go to the crash site of the Black Hawk helicopter and American Airlines plane.
— Art Candee 🍿🥤 (@ArtCandee) January 30, 2025
His response?
"What’s the site? The water? You want me to go swimming?”
What a piece of sh*t. pic.twitter.com/h7m06m9a2R
64 మంది మృతి
గురువారం(జనవరి 30) అమెరికాలోని వాషింగ్టన్ డీసీ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎవరూ ఊహించని రీతిలో ప్రయాణికుల విమానం, సైనిక హెలికాప్టర్ ఢీకొన్నాయి. కాన్సాస్‌లోని విషిటా నుంచి బయల్దేరిన పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్ విమానం.. రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై దిగేందుకు సిద్ధమవుతుండగా.. సైనిక హెలికాప్టర్ సికోర్‌స్కీ హెచ్-60 బ్లాక్‌హాక్ వెళ్లి ఢీకొంది. ప్రమాదం తరువాత రెండూ నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో 64 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టగా.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్‌లో సిబ్బంది కొరత కూడా ప్రమాదానికి ఓ కారణంగా తెలుస్తోంది.