తొర్రూరు, వెలుగు: కాంగ్రెస్ స్కాముల పాలన కావాలో ? బీఆర్ఎస్ స్కీముల పాలన కావాలో ప్రజలే తేల్చుకోవాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ చెప్పారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో సోమవారం నిర్వహించిన రివ్యూలో వారు మాట్లాడారు. అరవై ఏండ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేసిందో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. బీఆర్‌ఎస్ వచ్చాక కాళేశ్వరం ద్వారా సాగు నీరు అందించి, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినట్లు చెప్పారు. 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు. కాంగ్రెస్ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయని పథకాలు ఇక్కడ ఎలా అమలు చేస్తారో చెప్పాలన్నారు. ఎంపీపీ అంజయ్య, జడ్పీటీసీ శ్రీనివాస్, కాకిరాల హరిప్రసాద్‌రావు, కిశోర్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీ ప్రారంభం
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంఠాయపాలెంలో నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీని సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు పోటీలు ఉపయోగపడుతాయన్నారు.