BSNL నెట్ వర్క్ కు మారిపోదామా.. : రీఛార్జ్ ధరల పెంపుతో భారీగా ఎంక్వయిరీలు

BSNL నెట్ వర్క్ కు మారిపోదామా.. : రీఛార్జ్ ధరల పెంపుతో భారీగా ఎంక్వయిరీలు

కాలం ఎప్పుడూ.. ఎవరికీ ఒకేలా ఉండదు.. నిన్నా మొన్నటి వరకు BSNL అంటే ఛీ..ఛీ అంటూ వెళ్లిపోయిన మొబైల్ కస్టమర్లు.. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తు న్నారు. BSNL ఆఫర్స్ ఏంటీ.. నెట్ వర్క్ పరిస్థితి ఏంటీ అని సెర్చింగ్ చేస్తున్నారు. మరో నెల రోజుల్లో.. అంటే ఆగస్ట్ 15వ తేదీ నాటికి దేశ వ్యాప్తంగా BSNL 4జీ నెట్ వర్క్ తీసుకొస్తుంది. ఈ క్రమంలోనే BSNL మొబైల్ రీఛార్జ్ ఆఫర్స్ ఎలా ఉన్నాయనే ఎంక్వయిరీలు లక్షల సంఖ్యలో పెరిగాయంట.. 

దీనికి కారణం.. జియో, ఎయిర్ టెల్, వడాఫోన్ తమ తమ రీఛార్జీ ధరలను పెంచటమే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ మూడు నెట్ వర్క్ ల కొత్త ధరలతో పోల్చితే.. BSNL నెట్ వర్క్ ఛార్జీలు ఏడాదికి 500 నుంచి 600 రూపాయల వరకు తక్కువగా ఉన్నాయంట.. కొన్ని ప్లాన్లలో అయితే ఏడారి రీఛార్జ్ లో 700 రూపాయల వరకు BSNL తక్కువగా ఉందంట.. దీంతో ఇయర్ ప్లాన్ కింద రీఛార్జ్ చేసుకునే మొబైల్ కస్టమర్లు.. ఇప్పుడు BSNL వైపు చూస్తున్నారంట..

BSNL కూడా ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుంటోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీ తన రీఛార్జ్ ప్లాన్‌లను చురుకుగా ప్రచారం చేస్తోంది.ఇతర టెలికాం ఆపరేటర్‌ల నుంచి ఇతర రీఛార్జ్ ప్లాన్‌లతో పోల్చినప్పుడు ఇవి మరింత సరసమైనవి. కంపెనీ 2G/3G నెట్‌వర్క్‌పై పని చేస్తోంది, దాని 4G సేవలు ప్రస్తుతం దేశంలోని ఎంపిక చేసిన సర్కిల్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఆగస్టులో దేశవ్యాప్తంగా తన 4G సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కూడా భాస్తున్నారు.