నోట్ దిస్ నెంబర్ : బయట తినే ఫుడ్ బాగోలేదా.. అయితే ఇలా కంప్లయింట్ చేయండి

గ్రేటర్ హైదరాబాద్ సిటీలో ఎన్ని హోటల్స్ ఉన్నాయో తెలుసా.. రిజిస్టర్ చేయించుకున్న హోటల్స్.. అక్షరాల 66 వేల హోటల్స్.. ఇవి కాకుండా రోడ్డు పక్కన ఉండే చిన్న చిన్న హోటల్స్ మరికొన్ని వేలు ఉంటాయి.. రోజూ లక్షల మంది ఈ హోటల్స్ లో టిఫిన్ చేస్తారు.. భోజనం చేస్తారు.. డ్రింక్స్ తాగుతారు.. రాత్రి డిన్నర్ చేస్తారు.. ఇంటికి పార్సిల్స్ తీసుకెళుతుంటారు.. మరి అలాంటి హోటల్స్ లో ఫుడ్ బాగోలేకపోతే ఏం చేయాలి.. ఎవరికి కంప్లయింట్ చేయాలి అనేది చాలా మందికి తెలియదు.. ఆ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. 

గ్రేటర్ హైదరాబాద్ లోని హోటల్స్ లో మీరు తినే ఫుడ్ బాగోలేకపోతే GHMC నెంబర్ 040 21111111  నెంబర్ కు కాల్ చేసి కంప్లయింట్ చేయొచ్చు. 24 గంటల్లో యాక్షన్ తీసుకుంటారు. అంతే కాకుండా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) టోల్ ఫ్రీ నెంబర్ 1800112100 కు కాల్ చేసి కంప్లయింట్ చేయొచ్చు. ఈ నెంబర్లు 24 గంటలూ పని చేస్తాయి. మీరు కంప్లయింట్ చేసిన 24 గంటల్లోనే చర్యలు తీసుకోవటం జరుగుతుంది. మీరు హోటల్ లో తిన్నా లేక పార్సిల్ తీసుకెళ్లినా సరే ఎలాంటి అనుమానం వచ్చినా కంప్లయింట్ చేయొచ్చు ఆయా హోటల్స్ పై..

ALSO READ | జనం ప్రాణాలతో చెలగాటం : రామేశ్వరం కేఫ్, బాహుబలి కిచెన్ లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు

కొన్ని రోజులుగా హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా పెద్ద పెద్ద హోటల్స్ నుంచి చిన్న హోటల్స్ వరకు అన్నింటిలోనూ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద హోటల్స్ లోనూ నాణ్యత లేని.. తేదీ ముగిసిన ఆహార పదార్థాలు, వారాలు తరబడి నిల్వ చేసిన పదార్థాలతో తయారు చేస్తున్న ఫుడ్ ను కస్టమర్లకు సర్వ్ చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో సిటీ జనం తమ ఆరోగ్యాలపై ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయా హోటల్స్ లో మీరు ఫుడ్ తినే సమయంలో ఏదైనా సమస్య వస్తే వెంటనే పైన తెలిపిన నెంబర్లకు కాల్ చేసి కంప్లయింట్ చేయండి.