తమ నాయకుడ్ని మంత్రిగా చూడాలని.. మోకాళ్లపై గుడిమెట్లు ఎక్కాడు

జనగామ:  తమ నాయకుడి పట్ల అపార భక్తి ప్రపత్తులు కలిగి ఉన్న ఓ కార్యకర్త.. తమ నేత పెళ్లి రోజున దేవుడి ఆశీస్సుల కోసం కఠోర దీక్షతో విశ్వాసానికి మారుపేరుగా నిలిచాడు . తమ నాయకుడి పెళ్లి రోజు సందర్భంగా చిల్లూరుగుట్టలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి గుడి మెట్లు మోకాళ్లపై ఎక్కి.. 101 కొబ్బరి కాయలు కొట్టి అభిమానం చాటుకున్నాడు. తమ నాయకుడ్ని తొందర్లోనే మంత్రిగా చూడాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేయించాడు. జనగామ జిల్లాలో జరిగిందీ ఘటన.

ఉప ముఖ్యమంత్రి పదవి లేకున్నా ఎమ్మెల్యేగా కొనసాగుతూ.. ప్రజాసేవలో ముందుకు సాగుతున్న స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అంటే నాగరాజుకు అపార అభిమానం.. గౌరవం. తాను మూడుసార్లు చిల్పూరు గుట్ట దేవస్థానం చైర్మన్ గా ఉండడానికి ప్రధాన కారణం అయిన తాటి కొండ రాజయ్యను మళ్లీ మంత్రిని చేయాలని దేవుడికి పూజలు చేసేవాడు. అయితే ఇవాళ ఆయన పెళ్లి రోజు కావడంతో..  చిల్లూర్‌ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి సన్నిధికి  మోకాళ్లపై గుడిమెట్లు ఎక్కాడు. 101 కొబ్బరికాయలు కొట్టాడు. తమ నాయకుడి పేరు మీద ప్రత్యేక పూజలు చేయించాడు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. చిల్పూర్‌ గుట్ట దేవస్థానంలో మూడు పర్యాయాలు చైర్మన్‌గా కొనసాగిన తనకు ‘రాజయ్య అంటే నాకు ఎంతో గౌరవం.. అభిమానం.. తొందర్లోనే ఆయనను మంత్రిని చేయమని దేవుడిని కోరుకున్నాను’ అని తెలిపాడు.

Read more news

మనస్పర్థలతో ఫ్రెండ్స్ మధ్య గ్యాప్.. ఈ గ్యాప్ రావొద్దంటే..

సినిమాల్లోనే విలన్.. రియల్ లైఫ్‌లో మాస్ హీరో

బిచ్చమడిగితే చిల్లరివ్వకుండా ఏకంగా జాబులే ఇప్పించిండు

మొదలైన వింటర్ క్రైసిస్.. పెరుగుతున్న కరోనా కేసులు