పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన రీసెంట్ మూవీ సలార్(Salaar). కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. కొంతకాలంగా సరైన హిట్టులేక సతమవుతున్న ప్రభాస్ కు సలార్ బిగ్గెస్ట్ హిట్ అందించింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అవుట్ అండ్ అవుట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు థియేటర్స్,ఓటీటీ ఆడియన్స్ ఊగిపోయారు.
తాజా సమాచారం ప్రకారం..ఇప్పుడు సలార్ మూవీలో టీవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే టీవీలో ఈ సినిమా చూస్తూనే అందులో ప్రభాస్ వాడిన రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంటి బైక్ గెలుచుకునే అవకాశం మేకర్స్ కల్పిస్తున్నారు. ఈ సినిమాను నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్ ట్వీట్ చేస్తూ.." సలార్ లో రెబల్ స్టార్ ప్రభాస్ నడిపిన..అదే ఐకానిక్ మోటార్‌సైకిల్‌ను గెలుచుకునే ప్రత్యేక అవకాశం ఇదిగోండి.
సినిమా టెలికాస్ట్ అవుతున్న 5.30 నుంచి 8 గంటల మధ్యలో స్క్రీన్ కు ఎడమవైపు వచ్చి వెళ్లే బైక్ ఇమేజ్/బగ్ ఎన్నిసార్లు కనిపించిందో మీరు లెక్కపెట్టాలి. తర్వాత ఎస్సెమ్మెస్ లైన్లు ఓపెన్ అవుతాయి. అప్పుడు 9222211199 నంబర్ కు SALAAR <బైక్ ఎన్నిసార్లు కనిపించిందో ఆ నంబరు> వేసి పంపించాలి. ఎస్సెమ్మెస్ లైన్లు ఏప్రిల్ 21 రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమవుతాయి" అని హోంబలె ఫిల్మ్స్ పోస్ట్ చేసింది.
ALSO READ : ఇద్దరిలో ఒకరే ఏడవండి..ఆసక్తిగా శర్వా మనమే టీజర్
అయితే దీనికోసం చాలా పెద్ద కండిషన్స్ ఏ ముందుంచారు. ఆ లిస్టు మొత్తానికి సంబంధించిన లింకును కూడా ఈ ట్వీట్లోనే ఉంచారు. అలాగే, ఇండియాకు చెందిన వారే అయి ఉండాలి..18 ఏళ్ల పైబడి వయస్సు ఉండాలి..లాంటి ఎన్నో కండిషన్స్ ఉన్నాయి.అయితే ఆలస్యం ఎందుకు..బైక్ ని పట్టేయడానికి సిద్ధం కండి..ప్రభాస్ అన్న ఫీలింగ్ పొందండి.
ఈ మూవీ రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది.ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా సలార్ శౌర్యాంగపర్వం వస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా 2025 చివర్లో థియేటర్స్ లోకి రానుంది.
Here's your exclusive opportunity to win the same iconic motorcycle ridden by Rebel Star #Prabhas in #SalaarCeaseFire.
— Hombale Films (@hombalefilms) April 18, 2024
All you need to do is count the number of times the bike image/bug appears on the left of the screen during the movie from 5:30 PM to 8 PM. When the SMS lines… pic.twitter.com/WYMJ8FANqj