మాయమాటలు చెప్పే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలి: మాలోత్‌‌‌‌ కవిత

నర్సింహులపేట, వెలుగు : ఎన్నికల సీజన్‌‌‌‌ మొదలైనందున కొందరు లీడర్లు దొంగల మాదిరిగా వస్తున్నారని, వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని మహబూబాబాద్‌‌‌‌ ఎంపీ మాలోత్‌‌‌‌ కవిత సూచించారు. ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌‌‌‌తో కలిసి మహబూబాబాద్‌‌‌‌ జిల్లా నర్సింహులపేట మండలంలో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే తన ఫ్యామిలీని సైతం వదిలి పాలేరుగా ప్రజలకు సేవ చేస్తున్నారని కొనియాడారు.

వచ్చే ఎన్నికల్లో రెడ్యానాయక్‌‌‌‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ టేకుల సుశీల, సర్పంచ్‌‌‌‌ వేముల రజితారెడ్డి, మండల అధ్యక్షుడు మైదం దేవేందర్, సర్పంచ్‌‌‌‌ల ఫోరం మండల అధ్యక్షుడు  మెరుగు శంకర్ పాల్గొన్నారు.