పీయూ పేరు మార్చం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీ పేరు అలాగే ఉంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్  తెలిపారు. ఆదివారం యూనివర్సిటీలో రూ.10 కోట్లతో నిర్మించే సెంట్రల్  రీసెర్చ్  ఫెసిలిటీ బిల్డింగ్  పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలమూరు యూనివర్సిటీ పేరు మార్చకుండా సురవరం ప్రతాపరెడ్డి పేరు జోడించాలని అనుకున్నట్లు తెలిపారు. తెలంగాణ వచ్చాక ప్రతి జిల్లాకు మెడికల్, నర్సింగ్ కాలేజీలు, హాస్పిటల్స్  వచ్చాయని తెలిపారు. 

ALSO READ :మళ్ళీ విడాకుల గొడవలో నాగ చైతన్య

ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. యూనివర్సిటీలో అన్ని భవనాల పనులు త్వరలోనే కంప్లీట్ చేస్తామని తెలిపారు. యూనివర్సిటీకి లా కోర్స్  వచ్చేలా కృషి చేస్తామన్నారు. పీయూ వీసీ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్  రాథోడ్, రిజిస్ట్రార్  గిరిజ మంగతాయారు, ఓఎస్డీ మధుసూదన్ రెడ్డి, సైంటిస్ట్  పవన్ కుమార్, కౌన్సిలర్ లక్ష్మి పాల్గొన్నారు.