ఇండియా తరఫున వన్డేల్లో ఆడాలనే కోరిక తనలో మిగిలే ఉందని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పష్టం చేశాడు. టీమ్‌కు ఎప్పుడు అవసరమైనా తన సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. గతేడాది జనవరి 21న సౌతాఫ్రికాతో చివరి వన్డే ఆడిన అశ్విన్‌కు ఆ తర్వాత చాన్స్ రాలేదు. వరల్డ్ కప్ టీమ్‌లో ఉంటాడని భావించినా అవకాశం దక్కలేదు.
‘15 ఏళ్లుగా నేను ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నా. నా కెరీర్‌లో సక్సెస్, ఫెయిల్యూర్స్ సమానంగా ఉన్నాయి. అయితే ఇండియా క్రికెట్ మాత్రం ఎల్లప్పుడూ నా హృదయానికి చాలా దగ్గరగా ఉంటుంది. అలా ఉండాలనే టాటూ వేయించుకున్నా. టీమ్‌కు ఎప్పుడు అవసరమైనా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉంటా. ఏ క్షణమైనా అందుబాటులో ఉంటా. నేను వంద శాతం కష్టపడేందుకు రెడీ’ అని అశ్విన్ పేర్కొన్నాడు. వరల్డ్ కప్ టీమ్‌కు ఎంపికైన అక్షర్ పటేల్ నుంచి మేనేజ్‌మెంట్ ఎక్కువగా ఆశిస్తోందన్నాడు. ఇప్పుడున్న టైమ్‌లో అది సరైంది కాదని, అతనికి కొద్దిగా టైమ్ ఇవ్వాలన్నాడు.
డెత్ ఓవర్లలో రోహిత్ శర్మ చాలా డేంజర్ అని చెప్పాడు. ఇదే విషయాన్ని విరాట్ కోహ్లీ తనతో పంచుకున్నాడని చెప్పిన అశ్విన్.. హిట్‌మ్యాన్‌ను అడ్డుకోవడానికి డెత్ ఓవర్లలో బౌలింగ్ ఎక్కడ వేయాలో కూడా బౌలర్లకు తెలియదని సూచించాడు.