Waqf Amendment Act: అమల్లోకి వక్ఫ్ సవరణ చట్టం..నోటిఫికేషన్ జారీ

Waqf Amendment Act: అమల్లోకి వక్ఫ్ సవరణ చట్టం..నోటిఫికేషన్ జారీ

వక్ఫ్  సవరణ చట్టం 2025 నేటినుంచి (ఏప్రిల్ 8) అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర  మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 8, 2025న ఈ చట్టంలోని నిబంధనలు అమల్లోకి వచ్చే తేదీగా ప్రకటించింది కేంద్రప్రభుత్వం. గతవారం ప్రారంభంలో వక్ఫ్ సవరణబిల్లు నుంచి పార్లమెంట్ ఆమోదించగా.. శనివారం (ఏప్రిల్ 5) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఆమోద ముద్ర వేశారు. 

అయితే వక్ఫ్ సవరణ చట్టం 2025 ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనికి కౌంటర్ గా సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. ఈ విషయంలో ఏదైనా ఉత్తర్వు జారీ చేసే ముందు విచారణ జరపాలని కోరింది. కొత్తగా అమలులోకి వచ్చిన చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ పలువురు రాజకీయ నేతలు, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) ,జమియత్ ఉలామా-ఇ-హింద్ సహా 10 కి పైగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఏప్రిల్ 16న సుప్రీంకోర్టు విచారించనుంది.

మరోవైపు పశ్చిమబెంగాల్ లో వక్ఫ్ సవరణ చట్టం వ్యతిరేకిస్తూ తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. పెద్ద ఎత్తున ఆందోళనకారులు వీధుల్లోకి ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్ లో ఉత్రక్తత చోటు చేసుకుంది. పోలీసులు, ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులు వాహనాలతో పాటు పలు వెహికల్స్ కు నిప్పంటించారు.దీంతో ముర్షిదాబాద్ ప్రాంతం రణరంగంగా మారింది.