
వక్ఫ్ సవరణ బిల్లు:వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యసభకు ముందుకు వచ్చింది..గురువారం ( ఏప్రిల్ 3) న రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ప్రతిపక్షాల వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన లోక్ సభలో ఈ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. దాదాపు 12 గంటలపై గా చర్చ జరిగిన తర్వాత వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు 2025ని లోక్ సభ స్పీకర్ ఆమోదించిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి రాజ్యసభపై ఉంది.
అధికార NDA ఈ చట్టాన్ని మైనారిటీ వర్గాలకు ప్రయోజనకరంగా ఉందని గట్టిగా సమర్థిస్తోంది. అయితే ప్రతిపక్సాలు మాత్రం ఈ చట్టం ముస్లిం వ్యతిరేకం అంటున్నాయి. లోకసభలో వక్ఫ్ సవరణ బిల్లుకు అనుకూలంగా 288 ఓట్లురాగా వ్యతిరేకంగా 232 ఓట్లు వచ్చాయి. వక్ఫ్ బిల్లు ప్రకారం వక్ఫ్ ట్రిబ్యునల్స్ బలోపేతం, నిర్మాణాత్మక ఎంపిక ప్రక్రియ చేయనున్నారు. వక్ఫ్ బోర్డులకు వక్ఫ్ సంస్థల తప్పనిసరి సహకారాన్ని 7 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినప్పటికీ, రూ. లక్ష కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వక్ఫ్ సంస్థలు ఆడిట్‌లకు లోనవుతాయని బిల్లు పేర్కొంది.
మైనార్టీలకు భారత దేవం సురక్షితమైన ప్రదేశం..ప్రపంచంలో ఇలాంటి చోటు మరొకటి లేదన్నారు. భారత్ లౌకిక వాద దేశం పార్సీల వంటి చిన్న మైనార్టీ సమాజం కూడా భారత్ లో సురక్షితంగా ఉంటుందని దేశంలోని మైనార్టీలందరూ గర్వంగా జీవిస్తున్నారని కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.