వక్ఫ్ బిల్లును బుల్డోజ్ చేశారు: సోనియా గాంధీ

వక్ఫ్ బిల్లును బుల్డోజ్ చేశారు: సోనియా గాంధీ

న్యూఢిల్లీ:  వక్ఫ్ బిల్లు రాజ్యాంగంపై దాడి అని  కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్​పర్సన్ సోనియా గాంధీ అభివర్ణించారు. బిల్లును లోక్‌‌‌‌‌‌‌‌సభలో ‘బుల్‌‌‌‌‌‌‌‌డోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ చేశారన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌‌‌‌‌‌‌‌లో సీపీపీ మీటింగ్ లో ఆమె మాట్లాడారు. 

‘‘వక్ఫ్‌‌‌‌‌‌‌‌ బిల్లుపై మా వైఖరి స్పష్టం. 12 గంటల పాటు చర్చించినా అపోజిషన్  సభ్యులకు ఎక్కువగా మాట్లాడే చాన్స్ ఇవ్వలేదు. ఈ బిల్లు దేశ ప్రయోజనాలు, ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. ప్రతిపక్ష పార్టీలన్నీ రాజ్యసభలో సమన్వయంతో ఈ బిల్లును తిప్పి కొట్టాలి. 

రాజ్యాంగాన్ని కాగితానికి పరిమితం చేస్తూ మోదీ ప్రభుత్వం దేశాన్ని అగాధంలోకి నెడుతున్నది. రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడమే బీజేపీ ఉద్దేశం’’అని సోనియా అన్నారు.