రాజ్యసభలో వక్ఫ్ బిల్లు ఆమోదం ..అనుకూలంగా 128..వ్యతిరేకంగా 95ఓట్లు

రాజ్యసభలో వక్ఫ్ బిల్లు ఆమోదం ..అనుకూలంగా 128..వ్యతిరేకంగా 95ఓట్లు

పార్లమెంటు వక్ఫ్ (సవరణ) బిల్లు, 2025ను ఆమోదించింది.రాజ్యసభ గురువారం(ఏప్రిల్ 3) అర్థరాత్రి ఎగువ సభ ఈ బిల్లును ఆమోదించింది.128 మంది సభ్యులు దీనికి అనుకూలంగా ఓటు వేయగా, 95 మంది సభ్యులు చట్టానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. రాజ్యసభ దాదాపు 12 గంటల పాటు బిల్లుపై చర్చ నిర్వహించింది. లోక్‌సభ ఇప్పటికే బిల్లును ఆమోదించింది. 

వక్ఫ్ సవరణ బిల్లు, 2025 వక్ఫ్ ఆస్తుల నిర్వహణను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా తీసుకొచ్చారు. వారసత్వ ప్రదేశాలను కాపాడటానికి,సామాజిక సంక్షేమాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ వక్ఫ్ చట్టంలో సవరణలుచేసింది.  ఆస్తి నిర్వహణలో పారదర్శకత,వక్ఫ్ బోర్డులు ,స్థానిక అధికారుల మధ్య సమన్వయం క్రమబద్ధీకరణ, వాటాదారుల హక్కుల రక్షణ ఈ చట్టం లక్ష్యం. 

ముస్లిం మహిళలు, ముఖ్యంగా వితంతువులు,విడాకులు తీసుకున్న మహిళల ఆర్థిక ,సామాజిక స్థితిని మెరుగు పర్చడం, మెరుగైన వక్ఫ్ పాలన వివిధ ముస్లిం వర్గాల నుండి ప్రాతినిధ్యం, వక్ఫ్ బోర్డును కలుపుకొనిపోయేలా చేయడానికి ఈ బిల్లు ఉద్దేశించబడింది. వక్ఫ్ (సవరణ) బిల్లు వక్ఫ్ పరిపాలన కోసం లౌకిక, పారదర్శక ,జవాబుదారీ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. ఈ బిల్లు భారతదేశంలో వక్ఫ్ పరిపాలన కోసం ప్రగతిశీల,న్యాయమైన చట్రాన్ని నిర్దేశిస్తుంది.