మేడ్చల్ లో మల్లారెడ్డి vs వజ్రేశ్ యాదవ్

మేడ్చల్ లో  మల్లారెడ్డి vs వజ్రేశ్ యాదవ్

మేడిపల్లి, వెలుగు: మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో మాజీ మంత్రి మల్లారెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్, వారి వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్​లోని 3, 11వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. 

ఆయా కార్యక్రమాల్లో మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, కాంగ్రెస్ కంటెస్టడ్ క్యాండిడేట్​ తోటకూర వజ్రేశ్ యాదవ్​ హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రోటోకాల్ విషయమై ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. నాయకులు సైతం కాసేపు వాగ్వాదానికి దిగారు. అనంతరం సఖ్యతతో గొడవ సద్దుమనిగింది. మేయర్ అమర్ సింగ్, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కాంగ్రెస్
 కార్పొరేటర్లు పాల్గొన్నారు.