వర్ధన్నపేట మున్సిపాలిటీలో వార్..!

వర్ధన్నపేట మున్సిపాలిటీలో వార్..!

వర్ధన్నపేట, వెలుగు: బిల్లులు, సమస్యల పరిష్కారాలపై అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల మధ్య వార్​సాగింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ ఆఫీస్​లో శుక్రవారం గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ విషయం చర్చిస్తుండగానే బిల్లుల సంగతి తెరపైకి వచ్చింది. అదే సమయంలో మున్సిపాలిటీలో పేరుకుపోయిన సమస్యలను కూడా సభ్యులు ప్రస్తావించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కౌన్సిలర్లు, ప్రతిపక్ష కౌన్సిలర్ల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. వర్ధన్నపేట మున్సిపాలిటీ భ్రష్టు పట్టడానికి అక్కడ పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ కారణమంటూ కౌన్సిలర్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలను పట్టించుకోకుండా కౌన్సిలర్లు, మున్సిపాలిటీ సిబ్బంది గొడవ పడడమేంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.