ఆప్ వర్సెస్ బీజేపీ.. ఢిల్లీలో మాటలు.. మంటలు

ఆప్ వర్సెస్ బీజేపీ.. ఢిల్లీలో మాటలు.. మంటలు
  • ఆపరేషన్ లోటస్ వ్యాఖ్యల ఎఫెక్ట్
  • కేజ్రీ ఇంటికి ఏసీబీ ఆఫీసర్లు 
  • కౌంటింగ్ కు 24 గంటల ముందు నాటకీయ పరిణామాలు

ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొన్ని గంటల్లో వెలువడనున్న తరుణంలో ఢిల్లీలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. బీజేపీ  ‘ఆపరేషన్‌ లోటస్‌’కు కుట్రలు పన్నుతోందని ఆప్‌ చీఫ్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.  దీనిపై బీజేపీ సీరియస్ అయ్యింది. కేజ్రీవాల్‌ ఆరోపణలపై విచారణకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఏసీబీని ఆదేశించారు. దీంతో ఏసీబీ రంగంలోకి దిగింది. కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ అధికారులు చేరుకున్నారు. బీజేపీ  తమ పార్టీ అభ్యర్థులను వారి వైపు లాక్కోవాలని ప్రయత్నాలు చేస్తోందని, పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫోన్‌ కాల్స్‌ చేసి రూ.15 కోట్లు ఇస్తామని ఆశ పెట్టినట్లు కేజ్రీవాల్‌ నిన్న ఆరోపించారు.  

పార్టీ నేతలను భయపెట్టి బీజేపీలో చేర్చుకోవడానికి తప్పుడు ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కమలం పార్టీ ఎన్ని కుట్రలు చేసినా తమ నేతలు మోసపోరని అన్నారు.  కేజ్రీవాల్ వ్యాఖ్యలపై సీనియర్‌ నేత సంజయ్‌ సింగ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ పార్టీపై అసంబద్ధమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఏసీబీతో విచారణ చేయించాలని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని  కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్ సంజయ్ సింగ్ లేఖ రాశారు. 

ALSO READ | ఈనెల 12, 13 తేదీల్లో అమెరికాకు ప్రధాని మోదీ

దీంతో ఏసీబీ రంగంలోకి దిగింది. అంతకు ముందే సీఎం అతిశీ,  70 మంది ఆప్ అభ్యర్థులతో సీనియర్‌ నేతలు మనీష్‌ సిసోదియా, సంజయ్‌ సింగ్‌, ఇమ్రాన్‌ హుస్సేన్‌ కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. ఏసీబీ అధికారులు ఏం తేల్చబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది.