
- కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల పోటాపోటీ నినాదాలు
- పోలీసులు లారీచార్జ్ .. నిరసనగా ఎమ్మెల్యే బైఠాయింపు
బాల్కొండ/ నిజామాబాద్,వెలుగు: నిజామాబాద్జిల్లా భీంగల్‌లో బుధవారం కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, బాల్కొండ బీఆర్ఎస్ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. ముందుగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాళేశ్వరం 21,21ఏ ప్యాకేజ్ పనులు, లిఫ్టు ఇరిగేషన్ పూర్తి చేయాలని, ఎస్సారెస్పీ రిజర్వాయర్ ను టూరిజం కింద డెవలప్చేయాలని కోరారు.
చెక్కులతో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్సర్కార్ చేసిన రూ.8 లక్షల కోట్ల అప్పులకు ప్రతినెలా రూ.6 వేల కోట్లు అసలు, వడ్డీ కడుతున్నామని పేర్కొన్నారు. అయినా స్కీమ్‌లు కొన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. రికార్డ్‌స్థాయి అప్పులు చేసి కూడా గత సర్కార్పేదలకు డబుల్ఇండ్లు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. దీంతో మంత్రి వ్యాఖ్యలకు సమాధానం చెప్పేందుకు తనకు మైక్ ఇవ్వాలని ప్రశాంత్‌రెడ్డి కోరారు.
దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. రెండు పార్టీల కార్యకర్తలు నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీస్లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. నిరసిస్తూ వేముల ప్రశాంత్‌రెడ్డి భీంగల్మెయిన్రోడ్పై బైఠాయించారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపిస్తూ నిరసనకు దిగారు.