జగదీప్ ధన్ఖడ్ vs ఖర్గే ...రాజ్యసభలో మాటల యుద్ధం

జగదీప్ ధన్ఖడ్ vs ఖర్గే ...రాజ్యసభలో మాటల యుద్ధం

రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగానికి విపక్ష సభ్యులు అడ్డుపడ్డారు. ఆయన మాట్లాడుతుండగా ప్రధాని అబద్ధాలు ఆపాలి, నీట్‌పై చర్చ చేపట్టాలంటూ నినాదాలు చేశారు.  ఈ క్రమంలో  రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్  ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే స్థానంలో జైరాం రమేష్ కూర్చోవాలని వ్యంగ్యంగా అనడంతో మాటల యుద్ధం నెలకొంది.  

వర్ణ (కుల) వ్యవస్థను తీసుకురావడానికి చైర్మన్ ప్రయత్నిస్తున్నారంటూ ఖర్గే తిప్పికొట్టారు. దీనిపై ధన్ఖడ్  సమాధానం ఇస్తూ..   కాంగ్రెస్ చీఫ్ తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. తాను  ఏమీ ఉద్దేశించి అనలేదని చెప్పారు.  తర్వాత పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తివారీ తన ప్రసంగాన్ని కొనసాగించారు

రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగానికి అడ్డుతగిలి, సభ నుంచి వాకౌట్ చేసిన విపక్ష సభ్యులపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో వారు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. విపక్ష నేతలు సభను కాదు. మర్యాదను విడిచి వెళ్లారు. ప్రజాస్వామ్యాన్ని అవమానించారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారు. రాజ్యాంగం అనేది చేతిలో పుస్తకం కాదు.. జీవితానికి మార్గనిర్దేశం అని వ్యాఖ్యానించారు.