భట్టి వర్సెస్ హరీష్.. రాష్ట్ర అప్పులపై అసెంబ్లీలో మాటల యుద్ధం

భట్టి వర్సెస్ హరీష్.. రాష్ట్ర అప్పులపై అసెంబ్లీలో మాటల యుద్ధం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడీగా సాగుతున్నాయి. రాష్ట్ర అప్పులపై అధికార కాంగ్రెస్, ప్రతి పక్ష బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఎఫ్ఆర్బీఎమ్ రుణ పరిమితిపై అసెంబ్లీ ప్రశ్నత్తరాల్లో జరిగిన చర్చలో హరీష్ రావు, డిప్యూటీ సీఎం మధ్య మాటల యుద్ధం జరిగింది. సభలో ఎఫ్ఆర్‎బీఎమ్ నిధుల వివరాలను భట్టి వెల్లడించగా.. దీనికి హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ అప్పుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తోందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. 

అప్పులపై ప్రభుత్వ పెద్దలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. తెలంగాణకు 7 లక్షలు కోట్ల అప్పు ఉందనేది నిజం కాదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది పాలనలో లక్షా 27 వేల కోట్లు అప్పు చేసిందని ఆరోపించారు. ఈ క్రమంలో హరీష్ రావు వ్యాఖ్యలకు భట్టి కౌంటర్ ఇచ్చారు.  2024 నవంబర్ వరకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలు 51 వేల 200 కోట్లు మాత్రమే అని చెప్పారు. 

Also Read:-చెన్నూరులో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేస్తున్నాం..

బీఆర్ఎస్ నేతలు వాస్తవాలు మాట్లాడటం లేదు.. అప్పులపై ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. హరీష్ రావు సభను పక్కదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులపై చర్చ జరగాలనే అధికారంలోకి రాగానే అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేశామని గుర్తు చేశారు.  రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చకు సిద్ధమని.. బీఆర్ఎస్ రెడీనా..? అని సవాల్ విసిరారు భట్టి. నిండు సభ సాక్షిగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు.. మీరా ప్రివిలైజ్ మోషన్ ఇచ్చిందని భట్టి సీరియస్ అయ్యారు. దీంతో రాష్ట్ర అప్పులపై భట్టి, హరీష్ రావు మధ్య మాటల యుద్ధం నడిచింది.