వరంగల్ : మహిళ మెడలోంచి దొంగలు పుస్తెల తాడు లాక్కెళ్ళిన ఘటన గురువారం ముల్కనూర్ రూరల్ బ్యాంక్ మూలమలుపు వద్ద చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మంచినీళ్ళబండకు చెందిన నరేండ్ల పద్మ కొడుకు అరవింద్ తో బైక్ పై అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామంలో ని తల్లిగారి ఇంటికి బయల్దేరింది. ములుకనూర్ రూరల్ బ్యాంక్ మూలమలుపు వద్దకు రాగానే గుర్తుతెలియని దుండగులు బైక్ పై వెనక నుంచి వచ్చి పద్మ మెడలోని రెండున్నర తులాల పుస్తెలు తాడు లాగారు. దీంతో బైక్ అదుపుతప్పి పద్మ, అరవింద్ కింద పడిపోయారు. ఈ క్రమంలో దుండగులు పుస్తెలతాడును బలంగా లాగడంతో మూడు గుండ్లు, పుస్తెలు కిందపడిపోయాయి. వెంటనే అరవింద్ బైక్ పై పుస్తెలతాడు ఎత్తుకెళ్తున్న దుండగులను మధ్య బస్టాండ్ దాకా వెంబడించినా వారు చిక్కకుండా తప్పిం చుకున్నా రు.
విషయం తెలుసుకున్న వంగర ఎస్సై ఉపేందర్, ప్రోబిషనరీ ఎస్సై శ్రావణిలు ఘటన స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. గాయపడ్డ పద్మను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సీసీ కెమెరాలు అలంకారమేనా బస్టాండ్ ప్రాంతంలో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాటన్ జిన్నింగ్ ప్లాం ట్ (బ్యాంక్
) ఉన్న సీసీ కెమెరాలో దుండగుల చిత్రం నమోదయింది. కానీ ముత్తారం గ్రామంలోని రెండు సీసీ కెమెరాల్లో దుండగుల చిత్రం నమోదుకాలేదు . ఇవి అలంకారంగా మాత్రమే మారాయి.