జీతాలు చెల్లించాలని వరంగల్​ బల్దియా డ్రైవర్ల ఆందోళన

వరంగల్​సిటీ, వెలుగు : పెండింగ్‌‌లో ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్‌‌ చేస్తూ గ్రేటర్‌  వరంగల్‌‌ ఆఫీస్‌‌ ఎదుట సోమవారం స్వచ్ఛ ఆటో డ్రైవర్లు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నాలుగు నెలల జీతాలను చెల్లించడంతో పాటు, పీఎఫ్‌‌, ఈఎస్‌‌ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌‌ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు డ్యూటీలోకి వచ్చేదే లేదని స్పష్టం చేశారు.