వరంగల్సిటీ, వెలుగు : మేడారం మహా జాతర సందర్భంగా పారిశుధ్య సేవల కోసం బల్దియా సిబ్బంది సోమవారం బస్సుల్లో బయల్దేరారు. ఈ సందర్భం గా సిబ్బంది కోసం ప్రత్యేకం గా ఏర్పాటు చేసిన బస్సులను మేయర్ గుండు సుధారాణి ప్రారంభించారు. మేడారం మహా జాతరకు వచ్చే భక్తుల కోసం పారిశుధ్య సేవలు అందించడానికి బల్దియా నుంచి సిబ్బందిని పంపడం ఆనవాయితీ గా వస్తుందన్నారు.
ప్రజారోగ్య విభాగం నుంచి 550 మంది కార్మికులు, 30 మంది జవాన్లు,6 శానిటరీ ఇన్స్పెక్టర్లు. 2 శానిటరీ సూపర్వైజర్లు, చెత్త సేకరణ కోసం 30 స్వచ్ఛ ఆటోలు, మూడు ట్రాక్టర్లు, 1 టిప్పర్, ఒక డోజర్, అర్బన్ మలేరియా నుంచి ఒక హెల్త్ ఇన్స్పెక్టర్,5 గురు హెల్త్ అసిస్టెంట్లు మేడారానికి వెళ్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ అనిసుర్ రషీద్ సీఎంహెచ్ ఓ డా. రాజేశ్ సానిటరీ సూపర్వైజర్లు సాంబయ్య, నరేందర్, భాస్కర్ పాల్గొన్నారు.