BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య

వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పు కున్నారు. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పార్టీ అధినేత కేసీఆర్ కు లేఖ  పంపారు. గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాంపింగ్ లాంటి వ్యవహరాలు, లిక్కర్ స్కాం  కేసులు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడం పార్టీకి మరింత నష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో నేను పోటి నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నాను అని లేఖలో పేర్కొంది. కేసీఆర్ , పార్టీ నాయకత్వం , కార్యకర్తలు నన్ను మన్నించాలని కోరారు కడియం కావ్య.