వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ ను ఖరారు చేశారు పార్టీ అధినేత కేసీఆర్. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సుధీర్ కుమార్ ప్రస్తుతం హన్మకొండ జడ్పీ ఛైర్మన్ గా కొనసాగుతున్నారు.
2001 నుండి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీకి విధేయుడుగా, అధినేతతో కలిసి పనిచేస్తున్న సుధీర్ కుమార్ సరైన అభ్యర్ధిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మేరకు అందరితో చర్చించి వారి సలహా సూచనల మేరకు కేసీఆర్ గారు సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ప్రకటించారు.
వరంగల్ ఎంపీ టికెట్ ను తాటి కొండ రాజయ్య కూడా ఆశించారు. ఏప్రిల్ 12న మధ్నాహ్నం కేసీఆర్ ఫామ్ హౌజ్ కు కూడా వెళ్లారు. రాజయ్యకు టికెట్ కన్ఫర్మ్ అని అనుకున్నారంతా. కానీ చివరి నిమిషంలో సుధీర్ కుమార్ ను కన్ఫర్మ్ చేసి ట్విస్ట్ ఇచ్చారు కేసీఆర్.
వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి కడియం కావ్య పోటీచేస్తుండగా.. బీజేపీ నుంచి ఆరూరి రమేష్ పోటీచేస్తున్నారు.