సిట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేల్లో..తూర్పు టెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

  • శనివారం రెండు చోట్ల రెండు రకాలుగా మాట్లాడిన కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     చల్లా ధర్మారెడ్డిని మరో సారి గెలిపించాలన్న మంత్రి
  •     ‘సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రజల దయ మీదే నన్నపునేని గెలుపు’ అంటూ కామెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనుమానమే అన్న ఆందోళనలో కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వరంగల్‍, వెలుగు : ఉమ్మడి వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీలో ‘తూర్పు’ టెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలైంది. శనివారం వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పర్యటించిన మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండు చోట్ల రెండు విధాలుగా మాట్లాడడంపై జోరుగా చర్చ జరుగుతోంది. టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద జరిగిన మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్ఫర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నట్లుగా మాట్లాడిన కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తూర్పు నియోజకవర్గ పరిధిలో జరిగిన మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రం స్పష్టత లేకుండా మాట్లాడారు. ప్రస్తుత సిట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలవాలంటే అటు సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇటు ప్రజల దయ ఉండాలంటూ చెప్పారు. దీంతో వచ్చే ఎన్నికల్లో నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనుమానమేనని పలువురు అంటున్నారు. అయితే తమ నియోజకవర్గాల పరిధిలో కూడా మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పెట్టి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆహ్వానించాలని, ఆయన నోటి నుంచి తమ టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కన్ఫర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలని ఆశపడుతున్న సిట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేలు ఇప్పుడు అయోమయంలో పడిపోయారు. మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తమ పేరు చెబుతాడా లేదా అని ఆందోళనకు గురవుతున్నారు.

అన్నీ తానే అన్నట్లు వ్యవహరిస్తున్న నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వరంగల్‍ తూర్పు నియోజకవర్గ సిట్టింగ్‍ ఎమ్మెల్యే నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గానికి, జిల్లా కేంద్రానికి తానేసుప్రీం అన్నట్లు వ్యవహరిస్తూ వస్తున్నారు. తక్కువ సమయంలోనే కార్పొరేటర్‍, మేయర్‍ నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజకీయాల్లో తన కంటే సీనియర్లు అయిన బస్వరాజు సారయ్య, గుండు సుధారాణితో పాటు ఎర్రబెల్లి ప్రదీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, వద్దిరాజు రవిచంద్ర వంటి లీడర్లను పట్టించుకోలేదు. కొందరిపై వ్యక్తిగత దూషణలకు సైతం దిగారు. సొంత పార్టీ లీడర్లతోనే తరచుగా ఫ్లెక్సీల పంచాయితీ జరుగుతోంది. పార్టీకి, కేసీఆర్‍, కేటీఆర్‍కు వీరవిధేయుడిని అని తనకు తానుగా ప్రకటించుకున్నారు. ఇదే టైంలో అభివృద్ధి పనులకు కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో శంకుస్థాపన చేయించి, భారీ బహిరంగ సభ నిర్వహించి మార్కులు కొట్టేయడంతో పాటు, టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కన్ఫర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలని భావించిన నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కష్టపడి పని చేస్తున్నాడని అంటూనే కేసీఆర్‍ ఆశీర్వాదం.. జనాల దయ ఉంటే మరోసారి గెలిచి వస్తాడని చెప్పడంతో నన్నపునేని వర్గం ఒక్కసారిగా డల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు. కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాటలను బట్టి తెరవెనుక ఏదో జరుగుతోందనే ఆందోళన వారిలో నెలకొంది.

పలువురికి టికెట్లు కన్ఫర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొన్ని రోజులుగా వివిధ నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలకు హాజరవుతూ అక్కడి సిట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేకు మరోసారి టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్ఫర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయినట్లు తన మాటల ద్వారా స్పష్టం చేస్తున్నారు. భూపాలపల్లిలో సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధుసూదనాచారిని కాదని సిట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే గండ్ర వెంటకరమణారెడ్డి పేరు ఖరారు చేశారు. హనుమకొండ జిల్లా పరిధిలో కొంత భాగం ఉండే హుస్నాబాద్‍ పర్యటనలో సిట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వొడితెల సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు పేరును ఓకే చేశారు. గత నెలలో హనుమకొండ వచ్చిన సందర్భంలోనూ వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పిలుపునిచ్చారు. 

పరకాలలో నాగుర్లకు నో చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

పరకాలలో చల్లా ధర్మారెడ్డి వరుసగా రెండోసారి విజయం సాధించారు. మొదటిసారి తెలంగాణ ఉద్యమ సమయంలోనూ టీఆర్‍ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి కాకండా టీడీపీ తరఫున గెలిచారు. ఆపై పార్టీ 
మారాక టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరపున రెండోసారి గెలిచారు. అయితే పరకాల టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రాష్ట్ర రైతు రుణ విమోచన కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాగుర్ల వెంకటేశ్వర్లు ఆశిస్తున్నారు. ఆయన అప్పుడప్పుడు నియోజకవర్గంలో తన కేడర్‍తో పర్యటిస్తూ, కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఈ సారి తనకు పరకాల సీటు ఖాయమని దగ్గరి వ్యక్తులకు సైతం చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్‍ చల్లా ధర్మారెడ్డి పేరునే ప్రకటించారు. టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావడంలో చల్లా కృషి ఎంతో ఉందని, అతడిపై పోటీ చేసేందుకు పెద్ద లీడర్లే కూడా భయపడిపోతున్నారని కొనియాడారు. దీంతో మళ్లీ ధర్మారెడ్డికి టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కన్ఫర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని తెలియడంతో నాగుర్ల వర్గం డిసప్పాయింట్‍ అయింది.

టెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు

నియోజకవర్గాల్లో జరిగే సమావేశాలకు హాజరవుతున్న కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన మాటల ద్వారా టికెట్లు కన్ఫర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తుండడంతో ఉమ్మడి వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు, ఇతర జిల్లాల్లోని సిట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేలు సైతం సభలు ఏర్పాటు చేసి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆహ్వానించేందుకు ఆరాటపడుతున్నారు. అయితే శనివారం వరంగల్‍ తూర్పు నియోజకవర్గంలో జరిగిన పరిణామాలతో వారు టెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడుతున్నారు. ‘కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తనకు తండ్రి, కేటీఆర్‍ తనకు అన్న’ అని చెప్పుకుంటూ భారీ సెట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వేసి వారి పుట్టినరోజులు జరిపించే నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓకే చేయకుంటే ఇక మన పరిస్థితి ఏంటని ఆందోళనకు గురవుతున్నారు. సభలు పెట్టి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆహ్వానించాలా ? వద్దా ? అని అయోమయంలో పడిపోయారు. నియోజకవర్గాల్లో కొంత ఎదురుగాలి వీస్తున్న ఎమ్మెల్యేల్లో అయితే టెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరింత ఎక్కువైంది.