వరంగల్ బంద్ కాకతీయ యూనివర్శిటీ (కేయూ) విద్యార్థి జాక్ పిలుపునిచ్చింది. కేయూ పీహెచ్డీ 2 కేటగిరి అడ్మిషన్లలో అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థులను గాయపర్చిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ తో వరంగల్ బంద్ కి పిలుపునిచ్చారు. కేయూలో వీసీ, రిజిస్ట్రార్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి నేతలు.
ALSO READ:కృష్ణకాంత్ పార్క్ లో.. పనులను త్వరగా పూర్తి చేయండి : రోనాల్డ్ రోస్
ప్రస్తుతం వరంగల్ లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. విద్యాసంస్థలు మూతపడ్డాయి. వాణిజ్య, వ్యాపార సముదాయాల్లో రద్దీ కనిపించడం లేదు. బంద్ కు సహకరించాలని కేయూ జేఏసీ విద్యార్థులు కోరుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు బంద్ కు మద్దతు తెలిపాయి.
వరంగల్ బంద్ సందర్భంగా కాకతీయ యూనివర్శిటీ వద్ద పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ప్రవేటు కళాశాల బస్సులను కేయూ జేఏసీ స్టూడెంట్స్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కేయూ జేఏసీ విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. తాము శాంతియుతంగానే నిరసన తెలుపుతున్నామంటున్నారు విద్యార్థి సంఘం నేతలు.