వరంగల్ మామునూర్ ఎయిర్ పోర్ట్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక విమానాలు ఎగురుడే..

వరంగల్ మామునూర్ ఎయిర్ పోర్ట్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక విమానాలు ఎగురుడే..

హైదరాబాద్: వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మామునూర్ ఎయిర్ పోర్ట్కు అనుమతిని మంజూరు చేస్తూ కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ కార్యదర్శి  అమిత్ కుమార్ జా, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్కు లేఖ ద్వారా తెలియజేసినట్లు మంత్రి తెలిపారు. మామునూర్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విమానాశ్రయ ప్రాధికార సంస్థ (Airport Authority of India) అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.

గత పదేండ్లుగా పెండింగ్లో ఉన్న NOC అడ్డంకిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జీఎంఆర్ సంస్థ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి, బోర్డులో పెట్టి NOC ఇచ్చేలా చేశారు. దీంతో HAIL తన బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మామునూర్ విమానాశ్రయ అభివృద్ధికి  అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల నిబంధనను సవరిస్తూ NOC ఇచ్చారు. ఇప్పుడు ఈ NOC ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిందని మంత్రి తెలిపారు. ఈ మేరకు కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ కార్యదర్శి  అమిత్ కుమార్ జా, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ కు లేఖ ద్వారా  తెలిపినట్లు మంత్రి వివరించారు. దీంతో మామునూర్ ఎయిర్ పోర్టు నిర్మాణం మరింత వేగంగా ముందుకు సాగుతుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

ALSO READ : 100 కోట్ల మంది దగ్గర ఖర్చులకు పైసల్లేవ్.. మరో 30 కోట్ల మంది ఇప్పుడిప్పుడే పైసల్ తీస్తుండ్రు

మామునూర్ ఎయిర్ పోర్ట్ గ్రాండ్ హిస్టరీ ఇదీ..
దేశంలో1930లో ఏర్పాటు చేసిన వరంగల్‍ మామునూర్ ఎయిర్‍పోర్టు అప్పట్లో సౌత్  ఏషియాలోనే అతి పెద్దదిగా రికార్డుల్లో ఉంది. దాదాపు వెయ్యి  ఎకరాల స్థలంలో విమానాల రాకపోకలతో 1981 వరకు కళకళలాడింది. చివరి నిజాం మీర్  ఉస్మాన్  అలీ ఖాన్.. సొలాపూర్, కాగజ్ నగర్‍  వంటి ఏరియాల్లో వ్యాపారాలు చేసేందుకు ఇక్కడి నుంచే ప్రయాణాలు సాగించేవారు.

ALSO READ : దేశ రక్షణ అందరి బాధ్యత:సీఎం రేవంత్రెడ్డి

రాష్ట్ర పర్యటనకు వచ్చే క్రమంలో రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు ఇక్కడే ఫ్లైట్  దిగేవారు. ఇండో–చైనా యుద్ధం నేపథ్యంలో టెర్రరిస్టులు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ను టార్గెట్  చేశారు. ఈ క్రమంలో మన విమానాలు పార్కింగ్‍  చేసేందుకు మామునూర్‍లో 1970లో పొడవాటి ఎయిర్‍షిప్‍  (హ్యాంగర్)  నిర్మించారు. 1970 నుంచి 1977 మధ్యలో ఇక్కడి నుంచే వివిధ ప్రాంతాలకు వాయుదూత్‍  విమానాలు నడిపారు.