- ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిండెంట్ బొమ్మినేని రవీందర్రెడ్డి
కాశీబుగ్గ, వెలుగు: మిర్చి పంటకు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుతున్నాయని వరంగల్ఛాంబర్ఆఫ్ కామర్స్ ప్రెసిండెంట్ బొమ్మినేని రవీందర్రెడ్డి తెలిపారు. సోమవారం వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయంగా ప్రస్తుతం మిర్చి రైతులు ధరలు తగ్గుతున్నాయన్నారు. మిర్చి రైతులు కోల్డ్ స్టోరేజీల్లో, ఇతర ప్రత్యామ్నాయ పద్ధతుల్లో పంటను నిల్వ చేసుకోవాలని సూచించారు.
ఏనుమాముల మార్కెట్కు భారీగా మిర్చి పంట వచ్చినా రెండేండ్లుగా మద్దతు ధరతో కొనుగోలు చేశామన్నారు. ఏనుమాముల మార్కెట్కు వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఆదిలాబాద్, కాగజ్నగర్, మంచిర్యాల, చెన్నూరు, మహబూబ్నగర్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నల్గొండ తదితర జిల్లాల నుంచి మిర్చి వస్తుందని తెలిపారు.
ఇక్కడి వచ్చిన మిర్చి చైనా, వియత్నాం, బంగ్లాదేశ్, థాయ్లాండ్, మలేషియా వంటి దేశాలకు ఎక్స్ఫోర్టు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో మిర్చి ధర లేకపోవడంతో ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసే పరిస్థితి లేదు. మిర్చి రైతులు వ్యాపారులు ఇబ్బంది పెట్టవద్దని కోరారు.