వరంగల్ మిర్చికి జీఐ ట్యాగ్

  • చపాట రకానికి అరుదైన గుర్తింపు
  • ఇండియన్‌ పేటెంట్‌ ఆఫీ స్‌ ఆమోదం
  • రెండేళ్ల క్రితం రూ. లక్షకు క్వింటా పలికిన ధర

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రమే సాగయ్యే చపాట మిర్చికి అరుదైన గుర్తింపు లభించింది.  ఎర్రటి రంగుతోపాటు తక్కువ మోతాదులో కారం ఉండే ఈ రకం మిరప.. తాజాగా జీఐ (జియోగ్రాఫిక్‌ ఇండికేషన్‌) ట్యాగ్‌ను సాధించింది. చపాట మిరపకు జీఐ ట్యాగ్‌ కోసం తిమ్మంపేట మిర్చి ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ రెండేండ్ల క్రితం దరఖాస్తు చేయగా.. ఇండియన్‌ పేటెంట్‌ ఆఫీ స్‌(ఐపీవో) తాజాగా ఆమోదించింది. 

‘జియోగ్రాఫిక్‌ ఇండికేషన్స్‌ జర్నల్‌’లోనూ చపాట రకం మిర్చికి సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి. చపాట రకం మిరపకాయలు టమోటా మాదిరిగా ఉంటాయి. అందుకే దీన్ని టమోటా మిరప అని కూడా పిలుస్తారు. రెండేళ్ల క్రితం చపాట మిర్చికి వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.లక్ష వరకు ధర పలికింది. తాజాగా జీఐ ట్యాగ్‌తో ఈ రకం మిర్చి ప్రత్యేక గుర్తింపు సాధించినట్లయింది.