
హసన్ పర్తి, వెలుగు: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. కేయూ ఆడిటోరియంలో గురువారం ‘మహిళా దినోత్సవ సంబరాల’ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళా లెక్చరర్లు అడ్మినిస్ట్రేషన్‌లో మల్టీ టాస్కర్స్ అన్నారు. విజయానికి షార్ట్ కట్స్ లేవన్నారు. భారతీయ సంప్రదాయాలను, కట్టుబాట్లను గౌరవించాలన్నారు.
కార్యక్రమంలో వీసీ ప్రతాప్ రెడ్డి, మహిళా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. భిక్షాలు, కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ టి. స్వప్న , పలువురు బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.