ఆగ్రం పహాడ్ సమ్మక్క సారలమ్మ జాతర-2020 ఏర్పాట్లను పరిశీలించారు వరంగల్ జిల్లా కలెక్టర్ హరిత. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్… జాతరకు 30లక్షల మంది భక్తులు వస్తారని వారికి ఎటువంటి అసౌకర్యాలు కలుగకూడదని చెప్పారు. జాతర నిర్వాహణ,భక్తుల సౌకర్యం కోసం చుట్టూ ఉన్న భూమిని ఆయా రైతులనుంచి సేకరించాలని చెప్పారు. భూమిని ఇచ్చిన రైతులకు నగదును వెంటనే చెల్లించాలని ఆదేశించారు.
జాతరకు వీలుగా.. రోడ్లు మరమ్మత్తులు చేయాలని పంచాయితీ రాజ్ అధికారులను ఆదేశించారు కలెక్టర్. నీటి ఎద్దడిలేకుండా చూడాలని, తాత్కాలిక టాయ్ లెట్స్ ను ఏర్పాటు చేయాలని… ఖర్చుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు. మేడారం వెళ్లే బస్సులను ఆగ్రం పహాడ్ మీదుగా వెళ్లేలా చూడాలని ఆదేశించారు. కలెక్టర్ తో పాటు పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి వివిధ శాఖల అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.