
నర్సంపేట, వెలుగు: టెన్త్‌లో 10/10 జీపీఏ సాధించిన స్టూడెంట్లకు దావతిస్తానని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట ప్రైమరీ స్కూల్లో ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా బోధనను కలెక్టర్ శనివారం ప్రారంభించారు.
అనంతరం హైస్కూల్ టెన్త్సెంటర్ను పరిశీలించి పరీక్ష రాయనున్న స్టూడెంట్లతో మాట్లాడారు. టెన్త్‌లో 10/ 10 జీపీఏ సాధించేందుకు స్టూడెంట్లు కష్టపడాలని సూచించారు. పైలట్‌ప్రాజెక్టు కింద వరంగల్జిల్లా వ్యాప్తంగా 11 ప్రభుత్వ పాఠశాల్లలో ఏఐ బోధనను ప్రారంభించినట్లు తెలిపారు. దీనిపై ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందన్నారు.