పార్కుల అభివృద్ధికి ప్రపోజల్స్‌‌‌‌ రెడీ చేయండి : ప్రావీణ్య

  • బల్దియా ఇన్‌‌‌‌చార్జి కమిషనర్ ప్రావీణ్య

వరంగల్​సిటీ/కాశీబుగ్గ, వెలుగు : వరంగల్‌‌‌‌ నగరంలో జంక్షన్లు, పార్కుల అభివృద్ధికి ప్రపోజల్స్‌‌‌‌ రెడీ చేయాలని వరంగల్‌‌‌‌ కలెక్టర్, బల్దియా ఇన్‌‌‌‌చార్జి కమిషనర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. బల్దియా, కుడా ఇంజినీరింగ్‌‌‌‌ ఆఫీసర్లతో కలిసి శుక్రవారం వరంగల్‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌లో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో 9 జంక్షన్లు, 2 పార్కుల పునరుద్ధరణతో పాటు, పచ్చదనం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు అవసరమైన డీపీఆర్‌‌‌‌ను వెంటనే రెడీ చేయాలని చెప్పారు.

హనుమకొండ బాలసముద్రంలోని పార్క్‌‌‌‌ను అభివృద్ధి చేసి చిల్డ్రన్స్‌‌‌‌ పార్క్‌‌‌‌గా తీర్చిదిద్దడంతో పాటు వరంగల్‌‌‌‌ ఎంజీఎం హాస్పిటల్‌‌‌‌లో గ్రీనరీ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో కుడా సీపీవో అజిత్‌‌‌‌రెడ్డి, బల్దియా ఎస్‌‌‌‌ఈ ప్రవీణ్‌‌‌‌చంద్ర, హెచ్‌‌‌‌వో రమేశ్‌‌‌‌, ఈఈలు రాజయ్య, శ్రీనివాస్, భీమ్‌‌‌‌రావు పాల్గొన్నారు. అనంతరం పల్స్‌‌‌‌ పోలియో ప్రోగ్రాంపై జిల్లా స్థాయి టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ మీటింగ్‌‌‌‌ నిర్వహించారు.

ఈ నెల 3, 4, 5 తేదీల్లో పల్స్‌‌‌‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో డ్రాప్స్‌‌‌‌ వేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌‌‌‌వో వెంకటరమణ, ప్రకాశ్, గోపాల్‌‌‌‌రావు, రాంరెడ్డి, కౌసల్యాదేవి పాల్గొన్నారు.