సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్​

గ్రేటర్​వరంగల్, వెలుగు : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని స్ర్టాంగ్ రూమ్​ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును గురువారం వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్ర్టాంగ్ రూమ్ వద్ద సీల్స్ ను, సీసీ కెమెరాల పని తీరును పరిశీలించామన్నారు. పోలీసులు నిత్యం పర్యవేక్షణలో ఉండాలని ఆఫీసర్లను ఆదేశించామన్నారు.

అనంతరం గీసుకొండ మండలంలోని ప్రభుత్వ అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆమెవెంట విద్యాశాఖ అధికారి వాసంతి, డీఆర్డీఏ, ఏపీఎం రేణుకా దేవి, డీపీఎం భవానీ, తహసీల్దార్ రియాజ్, మండల స్పెషల్ ఆఫీసర్ తదితరులున్నారు.