మద్ది మేడారం పనులను కంప్లీట్‌‌‌‌ చేయండి : ప్రావీణ్య

నల్లబెల్లి, వెలుగు : మద్ది మేడారం జాతర పనులను త్వరగా పూర్తి చేయాలని వరంగల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ ప్రావీణ్య ఆదేశించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో కలిసి శుక్రవారం నిర్వహించిన రివ్యూలో ఆమె మాట్లాడారు. జాతరకు టైంలో తాగునీరు, శానిటేషన్‌‌‌‌, వైద్యం, ట్రాఫిక్‌‌‌‌ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు.

ములుగు కలెక్టర్‌‌‌‌త మాట్లాడి జాతరకు నిధులు సమకూర్చేలా కృషి చేస్తానని చెప్పారు. అనంతరం సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద పూజలు నిర్వహించారు. సర్పంచ్‌‌‌‌ శ్రీదేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీసీపీ రవీందర్, ఆర్డీవో కృష్ణవేణి, ఏసీపీ తిరుమత్‌‌‌‌, ఆలయ చైర్మన్‌‌‌‌ సీతారామరెడ్డి, శ్రీనివాస్‌‌‌‌ గుప్తా, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.