హాస్పిటల్‌‌ పనులను స్పీడప్‌‌ చేయాలి : కలెక్టర్‌‌ ప్రావీణ్య

నర్సంపేట, వెలుగు : నర్సంపేటలోని 250 బెడ్ల జిల్లా హాస్పిటల్‌‌ పనులను స్పీడప్‌‌ చేయాలని వరంగల్‌‌ కలెక్టర్‌‌ ప్రావీణ్య ఆదేశించారు. నర్సంపేట శివారు దండుగడ్డ ప్రాంతంలో జరుగుతున్న హాస్పిటల్‌‌ పనులను శుక్రవారం హెల్త్‌‌ ఆఫీసర్లతో కలిసి పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం మెడికల్‌‌ కాలేజీకి కేటాయించిన 9 ఎకరాల భూమిని పరిశీలించి

వివరాలు తెలుసుకున్నారు. అంతకుముందు ఆర్డీవో ఆఫీస్‌‌లో వైద్య, ఆరోగ్య శాఖ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. అనంతరం లక్నేపల్లి హైస్కూల్‌‌ను తనిఖీ చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు టీచర్లు, స్టూడెంట్లు కృషి చేయాలని సూచించారు. టెన్త్​ ఫలితాల్లో వరంగల్‌‌ జిల్లాను ఫస్ట్‌‌ ప్లేస్‌‌లో నిలపాలని ఆదేశించారు.